Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2016 14:06:19
facebook Twitter Googleplus
Photo

24.. 240.. అంకెలు బాగా కలిశాయని చెప్పి సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఏదో సరదాకి రూ.240 కోట్ల మాట అన్నాడేమో అనుకున్నారు చాలామంది. కానీ నిన్న విడుదలైన ?24? సినిమాకు వస్తున్న రెస్పాన్స్.. తొలి రోజు అది సాధించిన కలెక్షన్లు చూస్తుంటే.. జ్నానవేల్ మాటే నిజమయ్యేలా కనిపిస్తోంది. తమిళ-తెలుగు భాషల్లో కలిపి ?24? ఫస్ట్ డే డొమెస్టిక్ వసూళ్లు రూ.25 కోట్లను దాటిపోవడం విశేషం. ఇది ఇండియా వరకు సాధించిన వసూళ్లు మాత్రమే. ఇంకా ఓవర్సీస్ లెక్కలు తేలాల్సి ఉంది. మొత్తం కలిపితే ఈజీగా రూ.30 కోట్లను దాటేసే ఉంటాయి. వీకెండ్ అయ్యేసరికే వసూళ్లు రూ.100 కోట్ల మార్కుకు చేరువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే వారం కూడా రెండు భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. మే అంటే సినిమాలకు బెస్ట్ సీజన్. పిల్లల్ని బాగా ఆకట్టుకునే సినిమా కావడం ?24?కు అతి పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి ఫ్యామిలీస్ సినిమాకు క్యూ కడతాయి. ఇక యూత్ ఆడియన్స్.. వైవిధ్యమైన సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు ?24? మంచి ఛాయిసే. కాబట్టి రెండు వారాల పాటు ?24? కలెక్షన్లు కుమ్మేసుకోవడం ఖాయం. దాదాపు పదేళ్లుగా సరైన విజయాలు లేని సూర్యకు ?24? కరవు తీర్చేసేలాగే ఉంది. వరుసగా ఫెయిల్యూర్లు వస్తున్నా ప్రయోగాలు మాత్రం ఆపకుండా వైవిధ్యమైన సినిమాలే చేస్తున్న సూర్య.. అందుకు మంచి ప్రతిఫలమే అందుకుంటున్నాడు. ?24?ను అతనే స్వయంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం.

,  ,  ,  ,  ,  ,