Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 16:09:51
facebook Twitter Googleplus
Photo

తెలుగు, తమిళ భాషల్లో హీరోగా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న సూర్య, తాజాగా 24 అనే ప్రయోగాత్మక సినిమాతో మనముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా ఆడియోకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోండగా, తాజాగా టీమ్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మే 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నట్లు హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో సూర్య స్పష్టం చేశారు.
13 బీ, ఇష్క్, మనం లాంటి చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ తీసిన సినిమా కావడంతో 24 సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ సమ్మర్‍కు రానున్న క్రేజీ సినిమాల్లో ఒకటిగా నిలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పట్నుంచే సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఉదయం హైద్రాబాద్‍లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ?24.. నా కెరీర్‌కి ఓ ప్రత్యేకమైన సినిమా. హిట్ అయ్యే ప్రతి సినిమా మంచి సినిమా అయిపోదు. నేను ఈ విషయాన్ని బలంగా నమ్మే, నా ప్రతి సినిమానూ మంచి సినిమాగా ఉండేలా, అదేవిధంగా హిట్ అయ్యేలా జాగ్రత్త పడుతూంటా. 24 సినిమా మనం వారం వారం చూసే తరహా సినిమా కాదు. కొత్తదనాన్ని ఎప్పుడూ ఇష్టపడే వాడిగా, విక్రమ్ కుమార్‌తో కలిసి ఈ మంచి ప్రయత్నం చేశా. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు కొత్తదనమున్న సినిమాలతో అలరించేందుకు ప్రయత్నిస్తూంటా.? అన్నారు. ఇదే కార్యక్రమంలో దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా మాట్లాడుతూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇక సూర్య స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను తెలుగులో నితిన్ విడుదల చేస్తున్నారు. సూర్య సరసన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,