Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 15:36:09
facebook Twitter Googleplus
Photo

దక్షిణాదిన ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉండే స్టార్ హీరోలలో సూర్య ఒకరు. మరోసారి ప్రేక్షకులను ఆనందింపచేయడానికి మొదటిసారిగా త్రిపాత్రాభినయం తో ముందుకు వస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ?24? సినిమాతో, తన నటనతో మరోసారి అభిమానులకు ఆనందం కలిగించబోతున్నాడు. భారీ ఎత్తున ఈ సినిమా పాటల ఆవిష్కరణ వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య నిత్యామీనన్ ని ఆకాశానికి ఎత్తేశాడు.
సూర్య మాట్లాడుతూ ? నిత్యా మీనన్ అద్భుతమైన నటి. ఎటువంటి సన్నివేశం అయినా కేవలం ఇరవై సెకన్లలో సంసిద్ధం అయిపోతుంది. అంతేకాకుండా తన అసమాన ప్రతిభ పాటు వివిధ శాఖలలో తనకున్న ప్రతిభకు తాను విస్మయం చెందాను. భవిష్యత్తులో తనతో కలిసి మళ్ళీ నటించాలని కోరుకుంటున్నాను? అని చెప్పారు. విక్రం కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన సమంత మరో కథానాయకిగా నటిస్తున్నది. మే 24 న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతున్నది.

,  ,  ,  ,  ,