Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 12:23:01
facebook Twitter Googleplus
Photo

సూర్య నటించిన ?సింగం'(యముడు), ?సింగం 2′(సింగం) సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ?సింగం 3? శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్య ఫారిన్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్, ఆ తరువాత చెన్నై, చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు మదనపల్లి దగ్గర ఓ క్వారీ వద్ద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నట్లు సమాచారం. నిన్న వైజాగ్ లో ప్రారంభం అయిన ఈ షూటింగ్ లో హీరో సూర్య పైన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సింగం సిరీస్‌లో ఇంతకు ముందు రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి నే మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తుండగా, స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య నిర్మిస్తోన్న ?సింగం 3? సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,