Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 13:50:06
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఇది. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే విషయం గతేడాదే ఖాయమైనా.. షూటింగ్ మాత్రం ఇవాళే ప్రారంభమైంది. అంతే కాదు.. పవన్ కూడా సెట్స్ లోకి వచ్చేసేయడం విశేషం.

త్రివిక్రమ్ తో మూవీని శరవేగంగా పిక్చరైజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు పవన్. ఇప్పటి వరకూ పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యంత భారీగా.. 90 కోట్ల రూపాయలతో ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రం కోసం.. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా 5 కోట్ల రూపాయలతో భారీ సెట్ నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ సెట్స్ కు వచ్చేయడంతో సెట్స్ లో షూటింగ్ హంగామా ఊపందుకుంది. మరోవైపు ఈ చిత్రం కోసం క్లీన్ షేవ్ తో స్టైలిష్ గా కనిపించనున్నాడు పవర్ స్టార్.

సర్దార్.. కాటమరాయుడు చిత్రాలు నిరుత్సాహపరచడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ మూవీపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో వండర్స్ చేయడం ఖాయంగా నమ్ముతున్నారు. త్రివిక్రమ్-పవన్ లకు జల్సా.. అత్తారింటికి దారేది తర్వాత ఇది హ్యాట్రిక్ కాంబినేషన్.

,  ,  ,  ,  ,  ,  ,