Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 13:30:46
facebook Twitter Googleplus
Photo

తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్య నటించిన సింగం సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ?సింగం? సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ?సింగం 3? నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇక్కడ ఈ నెల 27 వరకు షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఆ తరువాత 20 రోజుల విరామం అనంతరం వైజాగ్ లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. తరువాత జులై చివరలో మలేషియా లో జరిగే చివరి షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుందని సమాచారం.
సింగం -3 సినిమాని దశరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,