Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 11:19:12
facebook Twitter Googleplus
Photo

మూవీ మేకింగ్ లో అల్ట్రా స్టైలిష్ నెస్ ని చూపించడంలో సురేందర్ రెడ్డికి బోలెడంత పేరుంది. సూరి తీసే సినిమాల్లో నటిస్తే తాము ఎంతో స్టైలిష్ గా కనిపిస్తామనే ఉద్దేశ్యంతోనే.. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆఫర్ చేతిలో పెడుతుంటారు స్టార్స్. ఇప్పుడు తొలిసారిగా రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి చేసిన మూవీ ధృవ.. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది.

కోలీవుడ్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కిన ధృవకు.. స్క్రీన్ ప్లే విషయంలో సురేందర్ రెడ్డి పెద్దగా మార్పులేవీ చేయలేదని.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అలాగని రీమేక్ ని యాజ్ ఇటీజ్ గా దింపేసే బాపతు కాదు ఈ డైరెక్టర్. అందుకే తమిళ్ వెర్షన్ తో పోల్చితే బాగా రిచ్ గా.. స్టైలిష్ గా కనిపిస్తోంది సినిమా. వీటన్నిటితో పాటు.. సురేందర్ రెడ్డి ఇచ్చిన తన మార్క్ టచ్ ఏంటంటే.. టైటిల్ లోగో వెనక కనిపిస్తున్న నెంబర్ 8. ఈ నెంబర్ కి సంబంధించిన సీక్రెట్ గుట్టు క్లైమాక్స్ లోనే విప్పుతాడట సురేందర్ రెడ్డి.

ఇకపోతే తమిళ్ వెర్షన్ లో విలన్ అరవింద్ స్వామి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హీరో జయం రవి కాస్త డమ్మీలాగానే ఉంటాడు. కానీ తెలుగులోకి వచ్చేసరికి.. చరణ్-అరవింద్ స్వామిల మధ్య బ్యాలెన్స్ చేసేందుకు.. క్లైమాక్స్ ను తన స్టైల్ లో తీశాడట సూరి. చివరి 20 నిమిషాల పాటు మూవీ సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుందని.. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి కీలకంగా నిలుస్తుందని.. తమిళ్ వెర్షన్ తో పోల్చితే.. ధృవలోనే క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,