Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 12:31:08
facebook Twitter Googleplus
Photo

సౌత్ హీరోయిన్లలో నయనతారకు ఫుల్లు డిమాండ్. ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి అయినా.. ఈమెను నటింపచేసేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ తమిళ స్టార్ హీరో మాత్రం నయన్ అంటే వద్దు పొమ్మని చెబుతుండడం ఆశ్చర్యపోయే విషయం.

ప్రస్తుతం సింగం సిరీస్ లో మూడో పార్ట్ ని ఫినిష్ చేస్తున్న సూర్య.. తన నెక్ట్స్ మూవీని కూడా ఫైనల్ చేసేసుకున్నాడు. నయనతార లవర్ కం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి.. నయన్ రికమెండేషన్ తో ఆఫర్ ఇచ్చేశాడు. అయితే.. ఇప్పుడీ దర్శకుడు నయన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబడుతుంటే.. సూర్య మాత్రం కుదరదంటున్నాడట. ఇందుకు కారణం.. వీళ్లిద్దరి కాంబినేషన్ పై క్రేజ్ లేకపోవడమే. గజిని మూవీతో మొదట వీళ్లిద్దరూ కలిసి హిట్టు కొట్టినా.. ఆ తర్వాత ఆధవన్.. మాస్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే నయన్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు సూర్య ససేమిరా అంటున్నాడట.

అయితే ఈ సినిమాలో నయనతార అయితేనే.. కేరక్టర్ కి న్యాయం చేయగలదని వాదిస్తున్నాడట దర్శకుడు విఘ్నేష్ శివన్. దీంతో ఆలోచనలో పడ్డ సూర్య.. కొంత టైం కావాలని అడిగాడట. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మించనుండడంతో.. హీరోయిన్ విషయంలో పైనల్ డెసిషన్ సూర్యదే. మరి దర్శకుడి ఒత్తిడికి తలొగ్గి నయన్ ని తీసుకుంటాడో.. లేక అసలు ప్రాజెక్టునే వద్దంటాడో చూడాలి మరి.

,  ,  ,  ,  ,