Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 11:24:30
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఫిలిం ఇండస్ట్రీలో ఉండడంతో.. దాదాపుగా మీడియాకు ఏదో ఒక సమయంలో సమాధానాలు ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు. నీహారిక మినహాయిస్తే.. చిరు ఇంటి ఆడపడుచులు మాత్రం బయట మాట్లాడిన సందర్భాలు అసలు కనిపించవు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తే.. ఇప్పుడు చిరు డాటర్ సుశ్మిత కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం విశేషం.

ఈ ఇంటర్వ్యూలో తండ్రి గురించి ప్రశ్న ఎదురైనపుడు.. ఆయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుశ్మిత. 'నాన్న ఇప్పుడే కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు' అని చెప్పింది సుశ్మిత. ఈ మాట ఇప్పుడు చాలా చర్చలకు దారి తీస్తోంది. ప్రస్తుతం చిరు సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మెగా150ని కంప్లీట్ చేస్తారని.. ఆ తర్వాత సినిమాలు చేయకపోవచ్చని ముందు అనుకున్నా.. ఇప్పుడు 151..152లను కూడా లైన్ లో పెట్టడంతో.. సినిమాలకు ఇకపై దూరం కాకూడదని చిరు భావిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. నాన్న సినిమాల్లో ఉండడమే కంఫర్ట్ అని సుశ్మిత చెప్పినట్లుగా చాలామంది అంటున్నారు.

ఈలెక్కన చిరు రాజకీయాల్లో ఉన్నపుడు కంఫర్ట్ జోన్ లో ఆయన లేరనే అర్ధం వస్తుంది కదా.. అంటూ విపరీతార్ధాలు తీసేవారు కూడా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ కి స్టైలింగ్ చేస్తున్నది సుశ్మితే. మెగాస్టార్ లుక్స్ విషయంలో కూతురు తీసుకుంటున్న కేర్.. ఫ్యాన్స్ అందరికీ తెగ నచ్చేసిందిలే.

,  ,  ,  ,  ,