Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Apr-2016 11:08:34
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు చెప్పకపోతే మనోడు మాత్రం ఏం చేస్తాడులే కాని.. అయినా కూడా మహేష్ బాబు బావ సుధీర్ ఇంకా యాక్టర్ గా పరిణితి చెందాడా అనే సందేహం రాక మానదు. ఒక్కసారి ''బాగీ'' సినిమా చూశాక మాత్రం.. అదే డౌటు వస్తుంది.

నిజంగా ఎమోషన్ చూపించాల్సిన సీన్లో అస్సలు ఎక్సప్రెషన్ లేకుండా.. బీభత్సంగా భయపెట్టాల్సిన సీన్లో కేవలం ఒక చిన్న షార్ప్ లుక్ తో ఏదో చేద్దామని ప్రయత్నించి ఫుల్లుగా తడబడ్డాడు సుధీర్ బాబు. తన తొలి బాలీవుడ్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ అండ్ కలరి మార్షల్ ఆర్టుతో ఆక్టట్టుకున్నాడే కాని.. అస్సలు ఒక్కింత కూడా యాక్టింగ్ తో ఇంప్రెస్ చేయలేకపోయాడు. కేవలం ఫైట్స్ ఒక్కటే చేస్తే ఎలా బావ గారూ.. డిక్షనరీలో ఇంకా చాలా విషయాలున్నాయి. అవి కూడా చూపించాల్సిందే.

ఆ విధంగా సౌత్ నుండి వెళ్ళిన మరో యాక్టర్ కూడా బాలీవుడ్ లో బోల్తా పడ్డాడనే చెప్పాలి. కాకపోతే మనోడి ఫైట్లు చూసి ఏ సల్మాన్ ఖానో కాస్త ఇంప్రెస్ అయితే మాత్రం.. అక్కడ వరుసగా సినిమాలు చేసే ఛాన్సుంది.

,  ,  ,  ,  ,