Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 10:20:18
facebook Twitter Googleplus
Photo

త్రిపుర సినిమాతో తెలుగులో స్వాతి కెరీర్ బాగా దెబ్బ తినేసింది. అసలే కెరీర్ అంతంతమాత్రం.. అందులోనూ త్రిపుర అట్టర్ ఫ్లాప్ అయింది.. పైగా స్వాతి గ్లామర్ బాగా దెబ్బ తినేసింది. . దెబ్బకు ఆమె అడ్రస్ గల్లంతయిపోయింది. ఏడాదిగా స్వాతి ఇంకో సినిమానే చేయలేదు తెలుగులో. మధ్యలో ఒక మంచి ఛాన్స్ వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది కలర్స్ పాప. టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ?ఎక్కడికి పోతావు చిన్నవాడా?లో స్వాతి కీలకమైన పాత్ర పోషించాల్సిందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అమల పాత్రను ముందు స్వాతికే ఆఫర్ చేశారట.

స్వామి రారా.. కార్తికేయ సినిమాలతో నిఖిల్-స్వాతి జోడీ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఆమెకీ రోల్ ఆఫర్ చేశారట. ఐతే ఇది అతిథి పాత్రలా ఉందని.. నిడివి తక్కువని స్వాతి రిజెక్ట్ చేసిందట. దీంతో అవికా గోర్ ను సంప్రదించారు. ఆమె సంతోషంగా ఒప్పేసుకుంది. ఇప్పుడు సినిమా సూపర్ హిట్టవడంతో అవికా ఆనందానికి అవధుల్లేవు. ఈ పాత్రకు ఆమె రూ.18 లక్షల పారితోషకం తీసుకుందట. అసలే కెరీర్ బాలేని పరిస్థితుల్లో ఒక మంచి అవకాశాన్ని వదిలేసుకుందే అని స్వాతి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్వాతి చేస్తే ఆ పాత్ర మరింత పండేదనడంలో సందేహం లేదు. అయినా ఇలా మిస్సయిన ఛాన్సుల్ని తలుచుకుని ఫీలైతే లాభం లేదు కాబట్టి కొత్త అవకాశాల కోసం చూస్తోంది స్వాతి. ఈ మధ్యే బరువు తగ్గించుకుని స్లిమ్ కూడా అయింది స్వాతి.

,  ,  ,  ,  ,  ,