Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2017 11:26:27
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. తన మరుసటి మూవీగా చారిత్రాత్మక కథాంశాన్ని ఎంచుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై రూపొందనున్న ఈ బయోపిక్ కోసం సుదీర్ఘ కాలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి.

టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక ఖర్చుతో(ఒక భాగానికి) రూపొందుతున్న మూవీ సైరా. మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ఇవాళ ఉదయం తొలి షాట్ పిక్చరైజేషన్ చేసేశారు. దీంతో సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు చిరంజీవి.. కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేపట్టారు. హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా.. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు.. ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.

తొలి స్వాతంత్ర్య సమరానికి ముందు కాలం నాటి కథను పరుచూరి బ్రదర్స్ అందించగా.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అనేక వాల్యూ ఎడిషన్స్ జరిగాయి. సంగీత దర్శకుడి విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

,  ,  ,  ,