Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:14:18
facebook Twitter Googleplus
Photo

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి .. చేతిలో నాలుగు డబ్బులు ఉండగానే అనుభవం వున్నవారితో కలిసి కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేది బాలీవుడ్ చిత్రపరిశ్రమలో బాగా కనిపిస్తుంది. అక్కడి కథానాయకులు .. నాయికలు ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున ఆ డబ్బుతో వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇప్పుడదే వాతావరణం దక్షిణాది చిత్రపరిశ్రమలోను కనిపిస్తుంది. ఇలా కొత్తగా వ్యాపారంలోకి దిగిన తారల్లో 'తాప్సీ' పేరు కూడా వినిపిస్తోంది.

కాస్త రిచ్ గా ఉండేవారి కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లకి అవసరమైన క్యాటరింగ్ ను ఏర్పాటు చేసే బిజినెస్ ని సన్నిహితులతో కలిసి తాప్సీ ఆరంభించింది. ఒక వైపున కొత్తగా వస్తోన్న అవకాశాలను అంగీకరిస్తూనే, ఈ బిజినెస్ లో బిజీ అయ్యేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే హోటల్స్ కి సంబంధించిన వ్యాపారంలో త్రిష .. నగల వ్యాపారంలో తమన్నా అడుగు పెట్టారు. ఆ స్థాయిలో కాకపోయినా తాప్సీ కూడా కొత్త రూటునే ఎంచుకుంది. అమ్మడు ఇందులో అధిక లాభాలను ఆర్జించాలనే ఆశిద్దాం.

,  ,  ,  ,  ,