Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 10:48:06
facebook Twitter Googleplus
Photo

అలనాటి హీరోయిన్ టబు.. ఇప్పటికీ లీడ్ కేరక్టర్లతో సినిమాలు చేస్తూనే ఉంది. ఏ జోనర్ అయినా.. ఏ కేరక్టర్ అయినా ఆకట్టుకోగలిగే ట్యాలెంట్ టబు సొంతం. వాస్తవానికి టబు చేసినన్ని విభిన్నమైన పాత్రలు.. రీసెంట్ టైంలో ఏ హీరోయిన్ కి దక్కి ఉండవు. అయితే.. ఈమెకు నెంబర్1 అనే ట్యాగ్ బాగా అచ్చొచ్చింది. కూలీ నెంబర్ 1 - బీవీ నెంబర్ 1 లాంటి సినిమాల్లో హీరోయిన్ కావడమే ఇందుకు కారణం.

టాలీవుడ్ లో చివరిసారిగా పాండురంగడు చిత్రంలో కనిపించింది టబు. భక్తి చిత్రంలో బాలకృష్ణ పక్కన నటించి తెగ సెగలు పుట్టించేసింది కూడా. ఇప్పుడీ సీనియర్ భామను.. టాలీవుడ్ తిరిగి పిలుస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్న భాగమతిలో.. టబుకు ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ ఆఫర్ చేశారట. ఈ పాత్ర తీరుతెన్నులు చూసి.. సినిమాలో నటించేందుకు టబు సై అనిందని తెలుస్తోంది.

భాగమతిలో ఈమెకు ఏ రోల్ చేశారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్ టైంలో అయితే ఫితూర్ - హైదర్ వంటి సినిమాల్లో తల్లి పాత్రలు చేసింది. అందుకే భాగమతిలో అనుష్కకు అమ్మగా నటించనుందనే టాక్ వినిపిస్తున్నా.. ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో చేసేందుకు టబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. సమ్మర్ తర్వాత భాగమతి సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,  ,  ,  ,  ,