Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:49:21
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు ఓవర్సీస్ లో.. ముఖ్యంగా అమెరికాలో.. అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఖచ్చితంగా మొదటి స్థానం ''బాహుబలి'' సినిమాకు.. రెండో స్థానం ''శ్రీమంతుడు'' సినిమాకు ఇచ్చేయాల్సింది. అన్ బీటబుల్ పొజిషన్ లో ఉన్నాయి ఆ రెండూ. అయితే ఆ తరువాత వచ్చే 3వ స్థానం కోసం చాలామంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న స్వయంగా మహేష్ ''బ్రహ్మోత్సవం''తో సునాయసంగా బీట్ చేస్తాడని అనుకున్నాం. కాని అందరికీ షాకిస్తూ.. ''అ..ఆ'' అక్కడ రెచ్చిపోతోంది.

తొలి వీకెండ్ గ్రాస్ లెక్కలు చూసుకుంటే.. బాహుబలి సినిమా 4.6 మిలియన్ డాలర్లు గ్రాస్ వసూలు చేయగా.. శ్రీమంతుడు సినిమా 2.09 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తరువాత స్థానంలో నాన్నకు ప్రేమతో ($ 1.635 మిలియన్).. అత్తారింటికి దారేది ($ 1.518 మిలియన్) సినిమాలున్నాయి. అయితే త్రివిక్రమ్ మార్కు బాగా పనిచేయడం.. అలాగే ఒక రోజు ఎక్సట్రా రావడం (అ..ఆ సినిమా గురువారం రిలీజైంది) ఇప్పుడు ''అ..ఆ'' కు బాగా ప్లస్సయిపోయాయ్. గురువారం $ 495611 శుక్రవారం ($ 362561) శనివారం ($ 533535) బాగా వసూలు చేసి.. ఏకంగా 1391707 (1.3 మిలియన్ డాలర్లు) గ్రాస్ సాధించిన ఈ అ..ఆ..లు ఆదివారం కలక్షన్ తో ఏకంగా ''నాన్నకు ప్రేమతో'' సినిమాను దాటేసి.. 3వ స్థానంలో సెటిల్ అయిపోయింది. ఒక నందమూరి మూవీ ఒక మెగా మూవీని సైతం బీట్ చేసిందంటే.. ఆడియన్స్ కు త్రివిక్రమ్ నేర్పిన అ..ఆ..లు ఎంతగా నచ్చాయో చూడండి.

ఇక లైఫ్ టైమ్ అమెరికా గ్రాస్ లెక్కలను తిరగేస్తే.. టాప్ 5 లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది ఈ నితిన్ అండ్ సమంత చిత్రం. ఇప్పటివరకు అమెరికా టాప్-5 చూస్తే.. బాహుబలి (8.46 మిలియన్ డాలర్లు.. తెలుగు/హిందీ/తమిళ వర్షన్లు కలిపి.. తెలుగు ఒక్కటే $ 6.9 మిలియన్).. శ్రీమంతుడు ($ 2.89 మిలియన్).. నాన్నకు ప్రేమతో ($ 2.02 మిలియన్).. అత్తారింటికి దారేది ($ 1.896 మిలియన్).. అ..ఆ ($ 1.7 మిలియన్ షుమారు) సినిమాలు ఉన్నాయి. చూస్తుంటే ఈ రికార్డులో కూడా నాన్నకు ప్రేమతో అండ్ అత్తారింటికి దారేది సినిమాలకు అ..ఆ ఎర్తింగ్ పెట్టేలా ఉందే!!!

,  ,  ,  ,  ,  ,  ,  ,