Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2015 11:26:17
facebook Twitter Googleplus
Photo

అప్పుడే విరిసిన తెల్ల తామరలా నాజూకుగా కనిపించే సౌందర్యం తమన్నా సొంతం. కథానాయకుడి వెంట మల్లెతీగలా సుకుమారంగా కనిపిస్తూ .. మెరుపుతీగలా అనిపించే ఆమె కత్తి పట్టవలసి వస్తే ఇంకా ఏమైనా ఉందా? బొకే బరువు మోయలేని ఈ చిన్నది కత్తి ఎలా తిప్పుతుందో ఏమో అని అభిమానులు టెన్షన్ పడటం ఖాయం. అభిమానుల సంగతి అలా ఉంచితే తాను మాత్రం చాలా భయపడ్డానంటూ 'బాహుబలి' సినిమాలోని ఓ సన్నివేశాన్ని గురించి తమన్నా చెప్పుకొచ్చింది.

బాహుబలి సినిమాలో అవకాశం వచ్చినందుకు ఆనందంతో ఎగిరిగంతేసిన తమన్నా, ఈ సినిమాలో ప్రభాస్ తో కత్తియుద్ధం చేయవలసి ఉంటుందని చెప్పగానే భయపడిపోయిందట. అపూర్వమైన సినిమా .. అద్భుతమైన పాత్ర కావడంతో అంగీకరించింది. అయితే తీరా కత్తియుద్ధంలో నటించవలసి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిందట. అది గ్రహించిన ప్రభాస్ ఈ విషయంలో ఆమెకి సహకరించాడట. ఎలాగో అలా కత్తి యుద్ధం చేశానుగానీ .. కత్తి యుద్ధంలో నటించడం సాధారణమైన విషయం కాదు బాబోయ్ అంటోంది. దీంతో ఈ కత్తియుద్ధం సీన్ ని మరింత కాన్సంట్రేషన్ చేసి చూడాలని అభిమానులు ఫిక్సై పోవడం ఖాయమనిపిస్తోంది.

,  ,  ,  ,