Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 12:47:56
facebook Twitter Googleplus
Photo

ఇంతకుముందు ఎలాంటి ఊపులో ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో వరుసగా స్టార్లతో సినిమాలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ బాహుబలి లాంటి మెగా ప్రాజెక్టులో నటించాక మరింత ఊపందుకోవాల్సిన ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. తెలుగులో ‘అభినేత్రి’ తర్వాత ఆమె కథానాయికగా నటించిన సినిమానే రాలేదు. అక్కడా ఇక్కడా ఏవో సినిమాలైతే చేస్తోంది కానీ.. ఆమె మునుపటి స్థాయిలో జోరుమీద లేదన్నది మాత్రం వాస్తవం. ఈ విషయాన్నే తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. నాకేం తక్కువ అంటోంది. తాను బహుభాషా నటిని అని.. వేర్వేరు చోట్ల విభిన్నమైన సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నానని చెప్పింది.

ప్రస్తుతం నేను మూడు భాషల్లో నటిస్తున్నా. ఆ సినిమాలన్నీ ప్రత్యేకమైనవే. తమిళంలో చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవాతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. అది సౌత్ సినిమానా అంటే చెప్పలేం. మూడు భాషలకు చెందిన వాళ్లు కలిసి సినిమా చేస్తున్నాం. ఆ సినిమాను నిర్మిస్తున్నది ముంబయికి చెందిన వ్యక్తి. అలాగే తొలిసారిగా తమిళ స్టార్ విక్రమ్ పక్కన్న స్కెచ్ సినిమా చేస్తున్నా. మరోవైపు హిందీ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమా చేస్తున్నా. మామూలుగా సౌత్ సినిమల్లో నటించే హీరో హీరోయిన్లు బాలీవుడ్ వెళ్తుంటారు. కానీ చిత్రంగా బాలీవుడ్ దర్శకుడైన కోహ్లి తెలుగులో వచ్చి సినిమా చేస్తున్నారు. ఇవి కాక కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్నా. పెళ్లిచూపులు తమిళ రీమేక్ లోనూ నేనే హీరోయిన్.

,  ,  ,  ,  ,