Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 11:06:06
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఎంత చెప్పినా తక్కువే. పాలు.. గులాబీ కలగలిపితే వచ్చే మేనిఛాయతో మిసమిసలాడిపోతూ ఉండే ఈ సన్నజాజి మొగ్గ.. వివాదాలకు దూరంగా.. తన పనేంటో తాను అన్నట్లుగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తుందన్న పేరు తమన్నా సొంతం. బాహుబలిలో అందాల ప్రదర్శనే కాదు.. యాక్షన్ సన్నివేశాలతో తనలోని మరో కోణాన్ని ప్రదర్శించింది.

ఈ నెలాఖరులో బాహుబలి2తో థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంలో తమన్నా మరోసారి మెరవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఆమె పాత్ర పరిమితంగా ఉంటుందన్న మాట వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. తమన్నా అందాలు బాహుబలి2లోనూ మరింత ఎలివేట్ కావటం ఖాయమని చెబుతున్నారు.

రిలీజ్కు ముందు.. విపరీతమైన హైప్ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ఈ టీం.. మొన్నా మధ్యన తెలుగులో గ్రాండ్ ఫంక్షన్ చేయగా.. ఇటీవల ముంబయిలో హిందీ వెర్షన్ ఫంక్షన్ చేశారు. తాజాగా తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండువగా చెన్నైలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తమన్నా.. హీరో ప్రభాస్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ప్రభాస్ అందరికి డార్లింగ్ అయితే.. తనకు మాత్రం..డియర్ ఫ్రెండ్.. అమేజింగ్ ఫ్రెండ్ అంటూ అభివర్ణించింది. బాహుబలి లాంటి సినిమాలో నటించటమే గొప్ప అవకాశమని.. ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు తాను అవార్డులు అస్సలు ఆశించలేదని.. ఆ మాటకు వస్తే.. బాహుబలిలో నటించటమే పెద్ద అవార్డుగా చెప్పేసింది.

,  ,  ,  ,  ,