Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:27:26
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో అ..ఆ.. పేరుతో ఓ ఆసక్తికర రొమాంటిక్ కామెడీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నితిన్, త్రివిక్రమ్, సమంతల కాంబినేషనే ఈ సినిమాకు మొదట్నుంచీ అంచనాలు తీసుకురాగా, ఈమధ్యే విడుదలైన పోస్టర్స్ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఫస్ట్‌లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ వెంటనే ఓ టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. రేపు (ఏప్రిల్ 13న) అ..ఆ.. ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.
హరికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తికాగా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా అప్పుడే మొదలైపోయింది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ఈనెల్లోనే విడుదల కానుండగా సినిమా మే నెల్లో విడుదల కానుంది. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్న ట్యాగ్‍లైన్‍తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీ కథతో మెప్పిస్తుందని సమాచారం.

,  ,  ,  ,  ,  ,  ,  ,