Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 14:04:59
facebook Twitter Googleplus
Photo

దేశంలోనే అతి పెద్ద హిట్ అయ్యి.. చరిత్ర సృష్టిస్తే సంతోషించాలి కానీ.. ఈమె బాధ వేరే. బాహుబలి2 లో తమ్ము నటించిన పాత్ర మరీ దారుణంగా ఉంటుంది. ఓ సైడ్ కేరక్టర్ కంటే తక్కువగా తమన్నా రోల్ ఉంటుంది.

అందుకే బాహుబలి తర్వాత.. ఎంతటి ప్రాజెక్ట్ అయినా.. ఎంతటి పెద్ద హీరో.. పెద్ద దర్శకుడు అన్నా సరే.. తన పాత్రకు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తోంది తమన్నా. అలాగని ఎవరి మీదా అలగడాలు లాంటివేమీ చేయలేదనే చెప్పాలి. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా అంగీకరిస్తానని చెబుతోంది తమన్నా. అయితే.. ఇక్కడ కూడా ముందుగా స్క్రిప్ట్ కే ఇంపార్టెన్స్ అని నొక్కి వక్కాణిస్తోంది. ప్రభాస్ తనకు మంచి మిత్రుడు అని చెబుతున్న తమన్నా.. యంగ్ రెబల్ స్టార్ తో హిందీ సినిమా ఛాన్స్ వస్తే అనే ప్రశ్నకు రియాక్ట్ అయింది. ఆ ఆఫర్ కనుక వస్తే.. తాను అదృష్టవంతురాలినే అని చెబుతున్నా.. తన రోల్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఆధారంగానే ఫైనల్ డెసిషన్ అని తేల్చేస్తోంది.

ఇదంతా చూస్తుంటే బాహుబలి2 తమన్నాకు పెద్ద షాక్ నే ఇచ్చిందని.. ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి ఈమె కోలుకోలేదని చెప్పచ్చు. ఇక మిల్కీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభుదేవాతో ఖామోషీ అనే చిత్రంలో తమన్నా నటిస్తుండగా.. హిందీ.. తమిళ్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

,  ,  ,  ,  ,