Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2015 14:37:50
facebook Twitter Googleplus
Photo

బెంగాల్ టైగర్ మాట నిలబెట్టుకుంటున్నాడు. రీషూట్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ.. తమ మూవీ ఏ రోజునైనా రిలీజ్ కి రెడీగా ఉందన్నాడు నిర్మాత. మరోసారి ఇలాంటి రూమర్స్ రాకుండా.. ముందు జాగ్రత్తగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. నవంబర్ 27న బెంగాల్ టైగర్ గా రవితేజ థియేటర్లలో గర్జించనున్నాడని కన్ఫామ్ చేసేశారు.

రవితేజ అంటేనే ఎనర్జీకి మారుపేరు. అందులోనూ ఇప్పుడు టైగర్ అయిపోతున్నాడు. మరి ఈ పులి పక్కన రెండు ఆడ పులులు కూడా ఉన్నాయి సినిమాలో. ఒక రోల్ మిల్కీ బ్యూటీ తమన్నా అయితే.. మరొక పాత్రని అందాల రాశిఖన్నా పాత్ర పోషిస్తోంది. హీరోయిన్స్ అందాలను గట్టిగానే టార్గెట్ చేశాడు డైరెక్టర్ సంపత్ నంది. ఫస్ట్ లుక్ టైం నుంచే హీరోతో పాటు హీరోయిన్స్ అందాలను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ.. బెంగాల్ టైగర్ లో బ్యూటీలతో విందు భోజనం పెట్టిస్తానని ఇన్ డైరెక్టుగా చెప్పాడు.

సాంగ్ టీజర్ లలో కూడా తమ్మూ రాశిఖన్నాలు రెచ్చిపోయి అందాలు ఆరబోశారు. ఎక్స్ పోజింగ్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారనే విషయం తెలుస్తూనే ఉంది. మరి రవితేజ అందించబోతున్న అందాలను తనివితీరా చూడాలంటే.. నవంబర్ 27వరకూ ఆగాల్సిందే.

,  ,  ,  ,