Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:43:24
facebook Twitter Googleplus
Photo

తనదైన శైలిలో కమర్షియల్ సినిమాలను తీసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే చాలు నార్త్ నటినటులైనా.. సౌత్ స్టార్స్ అయినా ఎగిరి గంతేసేవారు.. ఏ మాత్రం ఆలోచించకుండా మణి రత్నం సినిమాకు డేట్స్ ఇచ్చేవాళ్ళు. అయితే గత కొంత కాలంగా ఆయనను అపజయాలు వదలకపోవడంతో ప్రస్తుత రోజుల్లో చాలామంది నటి నటులు ఆయనతో సినిమా చేయడానికి కొంచెం వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.

అయితే టాలీవుడ్ హీరోలతో మణిరత్నం సినిమా చేస్తున్నాడని అప్పుడప్పుడు కొన్ని వార్తాలు వస్తున్నాయి. మొదట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు- మణి ఒక మంచి లవ్ స్టోరిని తీద్దామనుకున్నారని మహేష్ కూడా ఒకే చెప్పాడని టాక్ వినిపించింది. కానీ ఆ కథ ముందుకి వెళ్లలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా మణి రత్నం సినిమాను తీస్తున్నారని ఈ ఏడాది మొదట్లో టాక్ బాగా వచ్చింది. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం విజయాలతో దూసుకుపోతున్న నాని కూడా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. మణిరత్నం నలుగురి హీరోలతో చేయబోయే మల్టీస్టారర్ లో నాని కూడా సెలెక్ట్ అయినట్లు కోలీవుడ్లో కూడా టాక్ వినిపించింది.

అయితే నాని ఆ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనవసరంగా రిస్క్ ఎందుకని అనుకుంటున్నాడట. అలాగే ప్రస్తుతం నాని రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మణిరత్నం సినిమా జనవరిలో స్టార్ట్ అవ్వబోతోంది.

,  ,  ,  ,  ,