Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 13:48:08
facebook Twitter Googleplus
Photo

మిల్కీ వైట్ సోయగం తమన్నా కెరీర్ లో మెజారిటీ భాగం ఫ్లాపులే. అయినా కెరీర్ పరంగా ఎలాంటి ఢోఖా లేకుండా నడిపించేస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకోవడానికి కారణం మిల్కీలోని మేని విరుపులే. అప్పుడప్పుడు ఈ అమ్మడు రసికరాణిలా మెరుపులు మెరిపించడం వల్లే మన దర్శకనిర్మాతలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బాహుబలి చిత్రంతో తమన్నా పేరు దేశ విదేశాల్లో మార్మోగిపోయింది. పచ్చ బొట్టేసినా. . పిల్లగాడా..! అంటూ కుర్రాళ్ల గుండెల్లో దూరిపోయింది. ప్రభాస్ తో తమన్నా రొమాన్స్ గురించి బోలెడంత డిష్కసన్ సాగింది.

లేటెస్టుగా ఈ భామ సంపత్నంది దర్శకత్వంలో బెంగాళ్ టైగర్ చిత్రంలో నటించింది. ఇందులో మాస్ మహారాజా రావితేజ సరసన కథానాయికగా నటించింది. ఇందులో తమ్మూ అరవిరిసిన అందాల్ని దోర దోరగా చూపించబోతోంది. లేటెస్టుగా ఈ సినిమాలోని ఓ శాంపిల్ బిట్ సాంగ్ ని ఆన్ లైన్ లోకి వదిలారు. ''చూపులతో దీపాల'' అంటూ మెలోడియస్ గా సాగుతున్న ఈ పాటలో తమన్నా మిల్కీ దేహశిరులు కుర్రాళ్లకు పిచ్చెక్కించడం ఖాయం. తెలుపు ఎరుపు పసుపు కాంబినేషన్ ప్లెయిన్ చీరల్లో రతీదేవికి జెరాక్స్ కాపీలా కనిపించిన తమన్నా.. అదరగొట్టేసింది. రవితేజకి ఓ బ్లాక్ బస్టర్ హిట్ అవసరమైన వేళ ఇది. మరి బెంగాళ్ టైగర్ విజయంలో తమ్మూ అందాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో చూడాల్సిందే

,  ,  ,  ,