Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 17:55:34
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తున్నది. తమిళ్ సినిమా ?కత్తి? సినిమా రీమేక్ చేయాలని ఆ బాధ్యత ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మీద పెట్టిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆ కథ ని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా, మాతృక లో ఉన్న మాజిక్ చెడకుండా దర్శకుడు వివి వినాయక్ మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే రీతిలో సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ కథ ఫైనల్ వెర్షన్ విన్న మెగాస్టార్ చిరంజీవి కథ బాగా వచ్చిందని దర్శకుడిని అభినందించాడట. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి?

,  ,  ,  ,  ,  ,