Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:24:43
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరోయిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్ ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్ గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్ గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్.

ఇప్పటికే బాలీవుడ్ లో మూడు సార్లు ప్రయత్నించిన మిల్కీ బ్యూటీ తమన్నాకి హిట్ మాత్రం దక్కలేదు. కానీ ఈ సారి అభినేత్రితో గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ మూవీలో నటించేందుకు రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించుకుని మరీ చేసిందనే టాక్ ఉంది. ఇటు తమిళ్ దేవి(ల్).. తెలుగులో అభినేత్రి.. హిందీలో 2 ఇన్ 1(టూటక్ టూటక్ టూటియా అని మార్చారు లెండి) గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అటు ఈ మూవీ లేడీ ఓరియెంట్ గా సాగనుండడం.. రెండు రకాల వేరియేషన్స్ ఉన్న రోల్ చేయడం.. అమ్మడి ట్యాలెంట్ నే కాదు.. అదృష్టాన్ని కూడా పరీక్ష పెట్టేవే.

ఈ ఎగ్జామ్ లో పాస్ అయితే మాత్రం రిజల్ట్ అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు మిల్కీకి దక్కిన అరుదైన అవకాశం అభినేత్రి అంటున్నారు చాలామంది. అఫ్ కోర్స్ ఆఖరి అవకాశం అనేవాళ్లు కూడా ఉన్నారు లెండి. కానీ.. అభినేత్రితో తన ప్రతిభ చూపిస్తే.. మిల్కీ ఫేట్ మారిపోతుందంతే.

,  ,  ,  ,  ,  ,