Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:00:03
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్.. ప్రస్తుతం సెట్స్ పై ఉండి ఈ ఏడాదే రిలీజ్ కానున్న టాలీవుడ్ సినిమాల్లో చిత్రాల్లో.. అత్యధిక ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీ ఇదే. ఇద్దరు హీరోలకు కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల ఫస్ట్ టైం ఫిఫ్టీ క్రోర్స్ క్లబ్ లో అడుగుపెట్టిన జోష్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడమే ఇందుకు కారణం.

ఎన్టీఆర్ కి కెరీర్ బెస్ట్ ఇవ్వడానికి తను హ్యాట్రిక్ కొట్టడం కోసం ఎలాంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదట కొరటాల శివ. ఎన్టీఆర్ కి స్ట్రెంగ్త్ అయిన యాక్షన్ ని తన స్టైల్ ఫ్యామిలీ డ్రామాని ఓ రేంజ్ లో మిక్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి తోడు ఓ మాంచి ఐటెం సాంగ్ ని కూడా ప్లాన్ చేశాడట ఈ డైరెక్టర్. ఇందుకోసం సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశాడట.

ఎన్టీఆర్ పక్కన ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీతో డ్యాన్స్ చేయించాలన్నది కొరటాల ఆలోచన. ఇప్పటికే రెండు సినిమాల్లో ఐటెం భామగా కనిపించిన తమన్నాకి.. ఎన్టీఆర్ సినిమాలో ఆ కేరక్టర్ వేసేందుకు పెద్దగా అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు. అయితే.. ఇంకా ఆమెను అప్రోచ్ కాలేదు కానీ.. ఎన్టీఆర్-తమన్నా ఐటెం సాంగ్ ఉండేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. కాని ఎన్టీఆర్ ఆమెను తన తదుపరి సినిమా (వక్కంతం వంశీ మూవీ) లో హీరోయిన్ గా అనుకుంటున్నాడే.. ఇప్పుడెలా?

,  ,  ,  ,  ,  ,  ,