Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 13:31:09
facebook Twitter Googleplus
Photo

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించనున్న ?కత్తి సందై? అనే సినిమాను ఈ ఉదయం దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన, సౌతిండియన్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన తమన్నా హీరోయిన్‌గా నటించనుండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు.
తమిళంలో యాక్షన్ చిత్రాలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు సురాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మే నెల మొదటివారంలో సెట్స్‌పైకి వెళుతుందని టీమ్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాక తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటించనుండడం ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పూర్తిగా యాక్షన్ ఎంటర్‌‌టైనర్ సినిమాగా ఈ సినిమా ఉండనుందని టీమ్ స్పష్టం చేసింది.

,  ,  ,  ,  ,  ,