Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2015 11:14:10
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నట్టుగా 'గబ్బర్ సింగ్ 2' సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్ర - మాల్షేజ్ ఘాట్ లో క్రితం శుక్రవారం నుంచి జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంతవరకూ విలన్ గ్యాంగ్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తరువాత షెడ్యూల్లో పవన్ కల్యాణ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

తుపాకులు .. గుర్రాలతో కూడిన ఈ సన్నివేశాలలో పవన్ సందడి చేయనున్నాడనీ, త్వరలోనే ఆయన ఈ షూటింగులో జాయిన్ కానున్నాడని నిర్మాత శరత్ మరార్ చెబుతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ అనూహ్యమైన విజయాన్ని అందుకోవడం వలన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఆ స్థాయి సక్సెస్ ని ఈ సినిమా దక్కించుకుంటుందా అనే దానిపై ఆసక్తికరంగా చర్చలు నడుస్తూనే వున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,