Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2016 16:57:45
facebook Twitter Googleplus
Photo

మైకేల్ జాక్సన్ చనిపోయి నాలుగైదేళ్లవుతుంటే ఇంకా అతడితో కలిసి మన తమన్నా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడుతోంది ఆ మైకేల్ జాక్సన్ గురించి కాదులెండి. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా గురించి. అవును.. ప్రభుదేవాతో కలిసి పని చేయనుంది మిల్కీ బ్యూటీ. ఐతే ఆమె అతడి దర్శకత్వంలో సినిమా చేయట్లేదు. ప్రభుతో కలిసి నటించబోతోంది. ఓ తమిళ సినిమా కోసం ఈ కాంబినేషన్ తెరమీదికి రాబోతోంది. తమ్మూ తొలిసారి ఓ హార్రర్ సినిమాలో నటించబోతోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాలోనే ప్రభుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట తమ్మూ. విజయ్ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చి స్వయంగా ప్రభుదేవానే ఈ సినిమాకు తమన్నాను రెఫర్ చేసినట్లు సమాచారం. ప్రభు నటన వదిలిపెట్టేసి పుష్కరం దాటింది. ?నువ్వొస్తానంటే నేనొద్దంటానా? సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభు.. ఆ తర్వాత స్టైల్ - ఏబీసీడీ లాంటి ఒకటీ అరా సినిమాల్లో మినహా నటించలేదు. ఐతే విజయ్ చెప్పిన హార్రర్ స్క్రిప్టు నచ్చి ఈ సినిమా ఓకే చేశాడు. తమన్నాను ఏరి కోరి ఈ సినిమాకు ఎంచుకున్నాడంటే హీరోయిన్ పాత్ర ఆమెకు

అంత పర్ఫెక్టుగా సూటవుతుందేమో. తమ్మూ తమిళంలో ఇప్పటికే ?ధర్మదురై? అనే సినిమాలో నటిస్తోంది. అందులో విజయ్ సేతుపతి హీరో.

,  ,  ,