Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 12:23:49
facebook Twitter Googleplus
Photo

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై.. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. అక్కినేని నాగార్జున నిర్మించి నటించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. సెప్టెంబర్ 16న ఈ మూవీని రిలీజ్ చేయనుండడంతో.. నాగార్జున బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అయితే.. వీటిలో సినిమాలతో సమానంగా.. నాగార్జున కుమారుల పెళ్లిళ్లకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.

పిల్లల పెళ్లిళ్లు ఎప్పుడు చేస్తాన్నారనే ప్రశ్నకు సమాధానంగా.. ' డిసెంబర్ లో అఖిల్ నిశ్చితార్థం ఉంటుంది. నాగచైతన్య ఇంకా ఎప్పుడో తేల్చి చెప్పలేదు. తనకు ఇంకా టైం కావాలని అడుగుతున్నాడు. నా ఇద్దరు అబ్బాయిలు - ఇద్దరు కోడళ్లను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెడతాను. అప్పుడు పెళ్లి విషయాలను తీరిగ్గా మాట్లాడుకుందాం' అని చెప్పారు నాగార్జున. నాగ్ చెప్పిన ఈ ఆన్సర్ వింటే.. చిన్న కొడుకు నిశ్చితార్ధం ముందు జరిగిపోతుందని.. పెద్ద కొడుకు చైతు ఎంగేజ్ మెంట్ ఇంకా హోల్డ్ లోనే ఉంటుందనే విషయం అర్ధమవుతుంది.

ఇప్పటికైతే సమంత సినిమాలను యాక్సెప్ట్ చేసేయడం లేదు. పెళ్లి గురించో.. అత్తవారింటితో కలిసేందుకు టైమ్ కేటాయించేందుకో తెలీదు కానీ.. గ్యాప్ మాత్రం తీసుకుంది. కానీ.. తమ పెళ్లికి ఇంకా టైమ్ కావాలని చైతు చెప్పాడని నాగ్ అనడంతో.. మరో పజిల్ మొదలైపోయింది. అంతా ఫైనల్ అయ్యాక.. ఇంకా లేటెందుకబ్బా!

,  ,  ,  ,