Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 11:59:40
facebook Twitter Googleplus
Photo

త‌మ‌న్నా లేటెస్ట్ చిత్రం అభినేత్రి. ప్రభుదేవా హీరో. ఇదో థ్రిల్లర్. తమన్నా ఈ సినిమా సైన్ చేసినప్పటి నుండి ఒకటే చర్చ నడిచింది. కమర్షియల్ ఫార్మేట్ లో దూసుకుపోతున్న తమన్నా ఇప్పుడీ హారర్ జోనర్ కి ఎందుకు సైన్ చేసినట్లు అని.

అయితే త‌మ‌న్నా ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి కార‌ణం ప్ర‌భుదేవానే అట‌. ఈ విష‌యాన్ని స్వయంగా త‌మ‌న్నానే చెప్పింది. లేటెస్ట్ ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ మాట్లాడిన తమన్నా.. అభినేత్రి సినిమా ఒప్పుకోవ‌డానికి ప్ర‌భుదేవానే కార‌ణం. ఎందుకంటే ఆయ‌న డాన్సంటే నాకు పిచ్చి. ఆయ‌న కింగ్ ఆప్ డాన్స్. ఈ సినిమాతో ప‌నిచేసిన‌ప్పుడ‌న్నా ఆయ‌న‌తో ఇంట్రాక్ట్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌నిపించింది. అందుకే మరో రీజన్ ఆలోచన లేకుండా ఎస్ చెప్పా?అని చెప్పుకొచ్చింది.

అన్నట్టు.. అంతా అనుకున్నట్లు.. ఇదేదో హార‌ర్‌, ధ్రిల్ల‌ర్ సినిమా కాదట. అయితే ఏ జోన‌ర్‌కి చెందే సినిమానో చూసిన త‌ర‌వాత మీకే తెలుస్తోందని అంటోంది మిల్కీ బ్యూటీ.

,  ,  ,  ,  ,  ,