Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2017 11:39:30
facebook Twitter Googleplus
Photo

నీరు రాకడ పాత నీరు పోకడ అన్నట్లుగా ఇండస్ట్రీలోకి కొత్త అందాలు వచ్చే కొద్దీ వయసు మీరిన అందాలు మెల్లి మెల్లిగా తెర మరుగు అవుతుంటాయి. హీరోల మాదిరిగా ఏళ్లకి ఏళ్ల కెరీర్ హీరోయిన్లకి ఉండదనేది ఓపెన్ సీక్రెట్. అయితే ఇదంతా నిన్నమొన్నటి మాటలు అంటూ కొట్టిపారేస్తున్నారు నేటి తరం హీరోయిన్లు. ఇండస్ట్రీలో ఉండాలంటే హీరోయిన్ గా కొనసాగాల్సిన అవసరమే లేదు - ఫీల్డ్ మారి కూడా సినిమాలతో అనుబంధం ఉంచుకోవచ్చనే కొత్త పాలసీని ఇప్పటి హీరోయిన్లు సిన్సియర్ గా ఫాలో అవుతున్నారు. నిన్నటితరం హీరోయిన్ల అయితే ఏజ్ బారైన వెంటనే పెళ్లి చేసుకొని - మళ్లీ ల్యాంగ్ గ్యాప్ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి - స్పెషల్ అప్సీరెన్సులు - క్యారెక్టర్ పాత్రలు చేస్తూ సినిమాల్లో కొనసాగితే నేటి తరం హీరోయిన్లు మాత్రం ప్రొడ్యూసర్లుగా మారి ఏకంగా సినిమాల్లో పెట్టుబడి పెడుతూ తాము నిలబడటమే కాకుండా తోటి తారలకి - సినిమాల్లోకి రావాలని ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు ఇస్తూ వారికి కొత్త జీవితాల్ని పరిచయం చేస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ భామ అనుష్కశర్మ నిర్మాతగా మారి ఎన్ హెచ్ 10 - ఫిలౌరి వంటి సినిమాల్ని నిర్మించింది. ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక తెలుగులో బబ్లీ బ్యూటీ ఛార్మీ - దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి సినీ నిర్మాణంలో చురుకుగా ఉంది. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి తమన్నా వచ్చి చేరిందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా తమన్నా హీరోయిన్ గా ఓ సినిమా మొదలైందనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. లండన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కునాల్ తెలుగు - హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు వెర్షన్ కి మిల్కీబ్యూటీ నిర్మాతగా వ్యవహరించనుందట - అంతేకాదు ఈ సినిమాలో తమన్నా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,