Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 11:23:15
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయిని, టెక్నికల్ స్టాండర్డ్స్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ?బాహుబలి? సినిమాకు రెండో భాగమైన ?బాహుబలి ది కంక్లూజన్? ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లో ప్రభాస్, రానాలతో పాటు మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొననుండగా జూన్ 13 నుంచి 10 వారాల పాటు క్లైమాక్స్ చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ క్లైమాక్స్ షూట్‌లో పాల్గొనేందుకు తమన్నా ప్రస్తుతం వర్కవుట్స్ చేస్తూ కష్టపడుతున్నారు.
?బాహుబలి? మొదటి భాగంలో అవంతిక పాత్రలో అందరినీ మెప్పించిన తమన్నా, ఈ రెండో భాగంలోనూ అదే స్థాయిలో ఫైట్స్‌తో కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇందుకోసం తమన్నా నిపుణుల పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తూండడమే కాకుండా, గుర్రపుస్వారీ కూడా నేర్చుకుంటున్నారు. జూన్ చివరి వారంలో తమన్నా ?బాహుబలి? షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా 2017 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,