Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2016 11:09:54
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, డాలీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం యొక్క కథ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పవన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడట. పైగా ఏఈ చిత్రంలో పవన్ పాత్రకు ఓ లవ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. ఈ కథలో పవన్ యువకుడిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ విఫలమై పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడట. అలా ఉన్న అతనికి మరో అమ్మాయి పరిచయమై పెళ్లి పట్ల అతనికున్న అభిప్రాయాన్ని మారుస్తుందట.
ఈ ట్రాక్ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతూ మంచి ఫీల్ ను కలిగిస్తుందని, సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవముందో సినిమా విడుదలయ్యాక గానీ తెలీదు. ఇకపోతే తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. త్వరలో పవన్ ఈ షూటింగ్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం డాలీ ఇతర నటీనటుల మీద నడిచే ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ?నార్త్ స్టార్? ఎంటర్టైన్మెంట్? బ్యానర్ పై ?శరత్ మారార్? నిర్మిస్తున్న ఈ చిత్రంలో ?శృతి హాసన్? హీరోయిన్ గా నటిస్తుంది.

,  ,  ,  ,  ,