Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:46:22
facebook Twitter Googleplus
Photo

రాజులు ... రాజ్యాల నేపథ్యంలో తెలుగు తెరను ఎన్నో జానపద చిత్రాలు పలకరించాయి. తాజాగా ఈనాటి సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ 'బాహుబలి' తెరకెక్కింది. యువరాజులు సమస్త విద్యలను గురుకులాలో అభ్యసించేవారు. అస్త్రశస్త్రాలకి సంబంధించిన విద్యలతో పాటు, పథక రచనలు ... పన్నాగాలు తిప్పికొట్టడం వంటివి గురువు ముఖతా వాళ్లు నేర్చుకునేవాళ్లు. అంటే ఒక దేశాన్ని పాలించే యువరాజు .. గురువు ఆశ్రమంలో తయారవుతాడు. అంతటి విశిష్టమైన గురువు పాత్రను 'బాహుబలి' సినిమాలో తనికెళ్ల భరణి పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ మహా పరాక్రమవంతుడైన యువరాజుగా నటిస్తుండగా, ఆయనని ఆ స్థాయిలో తీర్చిదిద్దిన గురువుగా భరణి కనిపిస్తాడు. గురుకులానికి సంబంధించిన సన్నివేశాలను కేరళలోని అందమైన లొకేషన్లో చిత్రీకరించారట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతున్నారు. భరణి కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా ఇది మిగిలిపోతుందని అంటున్నారు. మే 31న ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ని విడుదల చేసి .. జూలై లో సినిమా మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,