Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2017 16:41:39
facebook Twitter Googleplus
Photo

జాక్వెలైన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. సెక్సీ ఫిగర్ కు తోడు అందాల ఆరబోతలో అడ్డంకులు ఏమీ లేకపోవడంతో ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో పెద్దగా కమర్షియల్ హిట్లు అంటూ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న జుడ్వా-2పైనే ఆశలు పెట్టుకుంది.

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న జుడ్వా-2లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ తోపాటు తాప్సీ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చిన తాప్సీ కూడా ఈసినిమాతో హిట్ లభిస్తుందనే ఆశతో ఉంది. ఈమధ్య ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లో ఈ హీరోయిన్లిద్దరూ పార్టీలో తెగ సందడి చేశారు. పొట్టిపొట్టి దుస్తుల్లో చేతిలో వైన్ గ్లాసులతో ఫొటోలకు ఫోజులిస్తూ ఓ రేంజిలో రచ్చ చేశారనే చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో జాక్వెలైన్ షేర్ చేసింది. జాక్వెలైన్ కు ఎట్టకేలకు తగిన డ్రింకింగ్ పార్ట్ నర్ దొరికిందంటూ అభిమానులు కామెంట్ చేశారు. సాధారణంగానే పార్టీల్లో హుషారుగా కనిపించే జాక్వెలైన్ తాప్సీతో కలిసి వైనేసి చిందేసింది.

నాగార్జున హీరోగా రెండు దశాబ్దాల క్రితం తెలుగులో వచ్చిన హలో బ్రదర్ సినిమానే హిందీలో జుడ్వా పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అప్పుడు జుడ్వాతో నవ్వులు పండించిన డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన కొడుకు వరుణ్ ధావన్ ను హీరోగా పెట్టి సీక్వెల్ చేస్తున్నాడు.

,  ,  ,  ,