టాలీవుడ్ లో సక్సెస్ రాకపోతే ఏంటి బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటామని స్పీడ్ గా దూసుకుపోతున్నారు.
ఆ లిస్ట్ లో ఇప్పుడు సొట్ట బుగ్గల సుందరి తాప్సి చాలా ఎనర్జీతో ఉంది. అమ్మడు మొదట టాలీవుడ్ లో ఏ స్థాయి విజయాలను అందుకుందో అందరికి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో బికినితో అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. తాప్సి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో అనురాగ్ కశ్యప్ సినిమా కూడా ఉంది.
ఇకపోతే తాప్సి కి జూడ్వా 2 సినిమా సక్సెస్ అన్ని విధాలా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని యాడ్స్ లో నటిస్తోన్న అమ్మడు రీసెంట్ గా ప్రముఖ ఉమెన్స్ హార్లిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యింది. దీంతో ప్రాడక్ట్ వాల్యుని మార్కెట్ ను పెంచేందుకు ప్రచారాలను బాగానే చేస్తోంది. ఉమెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటె మంచిది.