Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 10:51:14
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి.. చందమామ కాజల్ అగర్వాల్.. ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150లో జంటగా కనిపించనున్నారనే విషయాన్ని టాలీవుడ్ ఆడియన్స్ కి స్పెషల్ గా చెప్పాల్సిన పనేమీ లేదు. అయితే.. ఇప్పటివరకూ ఖైదీకి సంబంధించిన బోలెడన్ని విశేషాలు బైటకొచ్చాయి. రిలీజ్ చేసిన లుక్స్ మాత్రమే కాకుండా.. షూటింగ్ స్పాట్ నుంచి కూడా అనేక ఫోటోలు ఫ్యాన్స్ ని పలకరించాయి.

కానీ ఒక విజువల్ మాత్రం ఇప్పటివరకూ కనిపించలేదు. అదే.. చిరంజీవి-కాజల్ జంటగా ఎలా ఉండనున్నారు? వారి పెయిర్ స్క్రీన్ పై ఎలా కనిపించనుంది? లాంటి క్వశ్చన్స్.. చాలామంది మైండ్ ను టీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఓ చెక్ పెట్టేస్తూ.. ఓ స్పెషల్ ఫోటోను పోస్ట్ చేసింది ఖైదీ టీం. చిరంజీవి పక్కన చందమామ.. వాటే లుక్.. అదిరిపోయారంతే. కొత్త హెయిర్ స్టైల్ తో.. యంగ్ గా మారిపోయిన చిరంజీవి.. ఆయన పెదాలపై నవ్వు.. ఫ్యాన్స్ కి బోలెండంత సంతోషం పంచేస్తున్నాయి. పక్కనే ఉన్న కాజల్ ఎంత అందంగా కనిపిస్తోందో చెప్పేందుకు మాటలు కూడా కష్టమే.

ఈ ఫోటో షేర్ చేసేందుకు కాజల్ ఎంతగా ఉత్సాహం చూపిందంటే.. ఖైదీ యూనిట్ కంటే ఐదు నిమిషాల ముందే ట్విట్టర్ లో పెట్టేయడం విశేషం. చిరు-కాజల్ పెయిర్ ఎలా ఉండనుందో అనే ప్రశ్నకు ఒక్క ఫోటోతో ఆన్సర్ ఇచ్చేశారు.

,  ,  ,  ,  ,  ,