Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2017 12:24:34
facebook Twitter Googleplus
Photo

ఝుమ్మంది నాథం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన భామ తాప్సి పన్ను. మొదటి సినిమాతో ఘాటుగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత గ్లామరస్ పాత్రలు చేస్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంది. కానీ ఎన్ని సినిమాల్లో నటించిన అంత పెద్దగా హిట్స్ కాకపోవడంతో ఈ సారి హర్రర్ కథాంశంతో తానే కథానాయికగా రాబోతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే తాప్సి గురించి ప్రస్తుతం ఓ రూమర్ తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె ఆనందో బ్రహ్మ సినిమా కోసం లిప్స్ సర్జరీ చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తాప్సి ఇంతకుముందు నటించిన సినిమాల్లో ఉన్నట్లు ఆమె పెదాలు లేవని కొంచెం చేంజ్ అయ్యిందని అంటున్నారు. అలాగే తాప్సి నవ్వులో కూడా కొంచెం కొత్త ధనం కనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. సాధారణంగా హీరోయిన్స్ సర్జరీలు చేసుకోవడం కొత్తేమి కాదు. ఎప్పటినుండో వస్తున్న ఆచారమే.. వారి పెదాలు అందంగా కనిపించాలని ఇలియానా -అనుష్క మరియు శ్రుతి హసన్ వంటి వారు కూడా సర్జరీ చేసుకొని ప్రేక్షకులకు సరికొత్తగా కనిపించి హిట్స్ అందుకున్నారు. మరి తాప్సి కూడా సర్జరీ తరువాత ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి

గతంలో ఇలా సర్జరీ చేయించుకున్న భామలందరూ.. ఆ విషయాన్ని అడిగితే మాత్రం అస్సలు కాదనే చెప్పారు

,  ,  ,  ,  ,