Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 15:01:49
facebook Twitter Googleplus
Photo

హింది సినిమాలు చేయడం వలన సౌత్ సినిమాకు దూరం అయ్యింది కానీ.. రింగులు జుత్తు సుందరి తాప్సీ గ్లామర్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. కాకపోతే అమ్మడు అలాంటి రోల్స్ చేయడం ఇష్టంలేక మొత్తంగా తెలుగు సినిమాలు చేయడం మానేసింది. ఝుమ్మంది నాదం సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రికి పరిచయమైన తాప్సీ.. ఆమె అందాలను తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు పైన కొన్ని కామెంట్లు చేసి విమర్శలపాలైంది. అయితే ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చింది. అది కూడా కాస్త వెటకారంగానే.

ఒక పత్రిక ఇంటర్వ్యూ లో తన పై వస్తున్న నెగిటివ్ టాక్ కు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే.. ”నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. దాన్ని మీరు అలా అర్ధం చేసుకుంటే దానికి నేను ఏం చేస్తాను? నన్ను నమ్మండి. నేను ఏమి మాట్లాడానో రాఘవేంద్రరావు గారికి తెలుసు. మేం ఇద్దరం బాగానే ఉన్నాం. అక్కడ ఉన్నవారు అంతా దాన్ని సరిగానే అర్ధం చేసుకొన్నారు. 100+ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరక్టర్ పై ఎలా మాట్లాడాలో నాకు తెలుసుకదా. పైగా నేను చెప్పింది ఫ్యాక్ట్ కదా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాని తానేమీ తప్పుగా మాట్లాడలేదు అంటోంది.

తాప్సీ ఇప్పుడు ఆనందో బ్రహ్మ అనే హారర్ కామిడీ సినిమాతో తెలుగులోకి మళ్ళీ రాబోతుంది. ఈ సినిమా ఆగష్టు 18 నాడు విడుదలకానుంది. తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో బిజీ అయ్యేట్లు సీన్ కనిపించట్లేదు. అందుకే చిరాకొచ్చి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నట్లుంది మరి. ఇకపోతే హిందిలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న జూడ్వా2 సినిమాలో నటిస్తుంది. జూడ్వా2 కూడా యాక్షన్ కామిడీ సినిమాగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కమర్షియల్ సినిమాలే.

,  ,  ,  ,  ,