Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2014 10:52:02
facebook Twitter Googleplus
Photo

తాప్సీ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అయితే, ఆకతాయి అబ్బాయిల పని పట్టడానికి ఈ యుద్ధ విద్యని ఈ చిన్నది నేర్చుకోవడం లేదులెండి. సినిమా షూటింగులో భాగంగా దీనిని ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం తను అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'బేబీ' అనే హిందీ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె 'రా' (RAW) ఏజంట్ పాత్రను పోషిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ కు చెందిన కార్వ్ మగా మార్షల్ ఆర్ట్స్ ను ఆమెకు నేర్పిస్తున్నారు. ఈ పాత్రలో అమ్మడు రిస్కీ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తుందట. అందుకే, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది.

,  ,  ,  ,  ,