Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:03:35
facebook Twitter Googleplus
Photo

అభిమానం ఓ స్థాయి వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ అభిమానం హద్దులు దాటితేనే సమస్య. ముఖ్యంగా హీరోయిన్ల మీద కుర్రాళ్లు చూపించే అభిమానమే కొన్నిసార్లు శ్రుతి మించిపోతూ ఉంటుంది. వాళ్లకు లేని పోని తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటుంది. తాప్సి పన్నుకు ఈ మధ్య అలాంటి ఇబ్బందే ఎదురైంది. తాప్సి అంటే పడి చచ్చే ఓ అభిమాని ఆమెను కొన్నాళ్లుగా వెంటాడుతున్నాడట. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడట. ముందు ఆ కుర్రాడి అభిమానం చూసి ఆప్యాయంగా పలకరించి మాట్లాడానని.. కానీ అతను అడ్వాంటేజ్ తీసుకుని తన ప్రైవసీని దెబ్బ తినే ప్రయత్నం చేశాడని చెప్పింది తాప్సి. అభిమానులు హద్దుల్లో ఉంటే మంచిదంటూ ఆమె ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.

??ఆర్టస్టులుగా మమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే చాలా సంతోషిస్తాం. ఐతే అభిమానం విషయంలో కొన్ని పరిమితులుంటాయి. ఆకుర్రాడు సెక్యూరిటీని కూడా దాటుకుని వీఐపీ ఏరియాలో నన్ను కలవడానికి విఫలయత్నం చేశాడు. నేను షూటింగులో ఉండగా ఇబ్బంది పెట్టాడు. ఇదంతా చూసి నేను షాకయ్యాను. నన్ను చూడాలనుకునే అభిమానుల్ని నేను ఇష్టపడతాను. కానీ మా ప్రైవసీని కూడా వారు గౌరవించాలి. మేం కూడా మనుషులమే. అందరి లాంటి వాళ్లమే. జనాల దృష్టిలో ఉండటం సంతోషమే కానీ.. మమ్మల్ని కలవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసినపుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వ్యక్తితో ఇంతకుముందు మాట్లాడాను. అంతా సాఫీగానే సాగింది. కానీ అతను ఇప్పుడు చేసిన పని చూసి నేను భయపడ్డాను. ఆ వ్యక్తి నాకే హానీ తలపెట్టలేదు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఏమీ చేయలేదు. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం రెస్పాన్స్ వేరుగా ఉంటుంది?? అని తాప్సి చెప్పింది.

,  ,  ,  ,  ,  ,