Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 11:57:42
facebook Twitter Googleplus
Photo

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను రేంజ్ బాగానే పెరిగింది. సౌత్ లో ఉన్నంత కాలం సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువగా కనిపించిన ఈమె.. లీడ్ హీరోయిన్ గా నటించిన మూవీస్ ఫెయిల్యూర్స్ ఎదుర్కుంది. చివరకు గంగతో మంచి హిట్ సాధించాక.. తాప్సీ యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలిసొచ్చాయి. ఇదే ఊపులో బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకున్న తాప్సీ.. ఏకంగా అమితాబ్ మూవీలో నటించేసింది. బిగ్ బీతో కలిసి తాప్సీ నటించిన పింక్.. సెప్టెంబర్ 16న విడుదల కానుంది.

ఇప్పుడు మరో హిందీ సినిమాకి అంగీకరించడమే కాదు.. షూటింగ్ స్టార్ట్ కూడా చేసేసినట్లు చెప్పింది తాప్సీ. ఈసారి ఏకంగా టైటిల్ రోల్ చేసేస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. 'నామ్ షబానా' మూవీలో టైటిల్ రోల్ చేస్తున్నట్లు స్వయంగా చెప్పింది తాప్సీ. 'మరో సాహస ప్రయాణం మొదలైంది. మొదటిసారిగా నామ్ షబానాలో టైటిల్ రోల్ చేస్తున్నా. సీరియస్ యాక్షన్ కి సిద్ధంగా ఉండండి' అంటోంది తాప్సి. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాడు నీరజ్ పాండే.

బేబీ చిత్రంలో చిన్న పాత్ర చేయించిన నీరజ్ పాండే.. శివం నాయర్ దర్శకత్వంలో నామ్ షబ్నాను నిర్మిస్తున్నాడు. 'ఇది ఏజెంట్ షబానా స్టోరీ. ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో చేరి దేశానికి ఎలా సర్వీస్ చేశారనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది'అని చెప్పాడు దర్శకుడు శివం నాయర్.

,  ,  ,  ,  ,