Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2017 11:28:34
facebook Twitter Googleplus
Photo

సీనియర్ హీరో రాజశేఖర్ కొన్నేళ్లుగా ఫామ్ లో లేడు. వరుసగా సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తుండడంతో చాలానే గ్యాప్ కూడా తీసుకుని.. ప్రస్తుతం పీఎస్వీ గరుడ వేగ మూవీ చేస్తున్నాడు. గుంటూరు టాకీస్ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడం.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం లాంటివి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

అయితే నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. రీసెంట్ గా సన్నీ లియోన్ పై ఓ ఐటెం సాంగ్ కూడా పిక్చరైజ్ చేసి.. గరుడ వేగను కంప్లీట్ చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా.. ఇప్పుడు ఓ తమిళ్ మూవీకి రాజశేఖర్ సైన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు రీసెంట్ గా రాజశేఖర్ ను కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించాడు. ఈ కథ విపరీతంగా నచ్చడం.. అందులో తన పాత్ర డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోవడంతో.. ఈ మూవీలో నటించేందుకు రాజశేఖర్ వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తన కెరీర్ కీలకమైన దశలో ఉండడంతో విభిన్నమైన పాత్రలు చేసేందుకు రాజశేఖర్ ఆసక్తి చూపుతున్నాడు. అందులో భాగంగానే తన మాతృభాషలో సినిమా చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని యాక్సెప్ట్ చేశాడని అంటున్నారు. ఎంటర్టెయిన్మెంట్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,