Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Apr-2016 11:04:54
facebook Twitter Googleplus
Photo

అదేంటో తెలియదు కాని.. చెన్నయ్ లోని కొన్ని కార్పొరేట్ కంపెనీలు.. రికార్డింగ్ డ్యాన్సులకు తెగ డబ్బులు ముట్టజెబుతాయి. ఓ నాలుగు సంవత్సరాల క్రితం.. 20 నిమిషాల డ్యాన్సు కోసం డిసెంబర్ 31 రాత్రిన హీరోయిన్ ప్రియాంక చోప్రాకు 6 కోట్లు చెల్లించారు. ఇప్పుడు తాజాగా రింగుల జుత్తు గంగ.. మన తాప్సీ వంతొచ్చింది.

చెన్నయ్ కు చెందిన ఒక బడా కార్పొరేట్ కంపెనీవారు.. త్వరలో యాన్యువల్ డే జరుపుకుంటున్నారు. అందుకోసం తాప్సీకి ఓ దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చారట. ఓ ఆరగంట డ్యాన్సు వేస్తే.. 3 కోట్లు వరకు ఇవ్వడానికి రెడీ అన్నారు. మొన్నటివరకు సినిమాల్లేకుండా ఖాళీగా ఉన్న తాప్సికి.. అదేంటో ఒకేసారి ఇద్దరు దేవుళ్లు వరాలు ఇచ్చినట్లు.. సరిగ్గా ఇప్పుడే అమితాబ్ బచ్చన్ తో పింక్ సినిమా షూటింగ్ చేస్తుంటే ఈ ఆఫర్ వచ్చింది. అయినా కూడా మన అమ్మడు ఆ సినిమా షూటింగ్ ఏమన్నా పోస్టుపోన్ చేద్దామని శతవిధాలా ప్రయత్నించిందట. కాని ఉపయోగం లేకుండా పోయింది.

అందుకే సినిమావాళ్లు ముందే ఎగ్రిమెంట్లు గట్రా చేయించుకుంటారు. నేను ఓ రోజు బ్రేక్ తీసుకుంటా అంటే కుదరదు మరి. పాపం తాప్సీ.. ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క డ్యాన్స్ ఆఫరూ రాలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు పట్టినవేళ.. వారాయ్.. అంటూ పిలస్తున్నాయి ఆఫర్లు.

,  ,  ,  ,  ,  ,  ,