Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 11:23:02
facebook Twitter Googleplus
Photo

రిలీజ్ అయ్యాక దాన్ని ఆన్ స్క్రీన్ పై చూస్తుంటే.. ఆయా పాత్రల హావభావాలు ప్రేక్షకులను కదిలించేస్తుంటాయి. అలా కదిలించేంతటి ఇంటెన్సిటీని ఆయా పాత్రధారులు తమ నటనలో చూపించాల్సి ఉంటుంది. ఫ్రేమ్స్ మారినా.. ఫీలింగ్స్ మారకుండా యాక్టింగ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికంటే ముందే.. అంటే యాక్టర్స్ నటించడం కంటే ముందే.. అందుకు సంబంధించిన విజువల్ దర్శకుడి మైండ్ లో ఉండాలి.

అంటే.. దాదాపుగా ప్రతీ పాత్ర ఎలా ప్రవర్తించాలి.. నటించిన తర్వాత సీన్ ఎలా ఉండాలనే విజువల్ ముందుగానే డైరెక్టర్ బ్రెయిన్ లో ఉంటుందన్న మాట. ఇప్పుడు తాజాగా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న బాహుబలి2కి సంబంధించిన ఓ ఫోటోలో రాజమౌళి ఫేస్ ను చూస్తే ఈ విషయం పక్కాగా అర్ధమవుతుంది. ఈ పిక్ చూడగానే.. ఇది బాహుబలి ది కంక్లూజన్ క్లైమాక్స్ కు సంబంధించిన పిక్చర్ అనే విషయం మన బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది. కత్తుల రధం పక్కన ప్రభాస్.. రానా.. అత్యంత శ్రద్ధగా రాజమౌళి చెబుతున్న మాటలు వింటున్నారు. ముఖ్యంగా రానాకు సీన్ వివరిస్తున్నాడు జక్కన్న. కానీ రాజమౌళి ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్స్ చూస్తుంటే.. ఎంతటి క్రూరత్వం ప్రదర్శించాల్సి ఉంటుందో తను యాక్ట్ చేసి మరీ చూపిస్తున్న సంగతి తెలుస్తుంది.

మొత్తం బాహుబలి రెండు సినిమాలకు గాను.. అత్యంత కీలకమైన ఫైట్ కావడం.. మహేంద్ర బాహుబలి- భల్లాలదేవుడు పాత్రలు ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ కు దిగే సన్నివేశం కావడంతో.. ఈ క్లైమాక్స్ ఫైట్ ను ఎక్కువ కాలమే తెరకెక్కించారు. అందుకే రాజమౌళి ఈ ఫైట్ పై చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడని మనకు తెలుసు.

,  ,  ,  ,