Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:45:06
facebook Twitter Googleplus
Photo

సినిమా రేంజ్ బాగా పెరిగిందని అనడంలో సందేహం లేదు. గతంలో పలు తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యి పెద్ద హిట్స్ గా నిలవడం చూశాం. అలాగే తెలుగు రీమేక్ కథలే కాకుండా.. తెలుగు రైటర్స్ ఇచ్చిన కథలు కూడా సక్సెస్ లు నిలిచాయి. కానీ ఈ సారి మాత్రం తెలుగు సినిమాలే సత్తా చాటడం చెప్పుకోదగిన విషయం.

ఐఎండీబీ ఏటా ఇండియన్ టాప్10 మూవీస్ ను లిస్ట్ చేస్తూ ఉంటుంది. యూజర్ల ఓటింగ్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇలా జాబితా చేసిన టాప్-10లో ఈ సారి 3 తెలుగు సినిమాలు చోటు సంపాదించుకున్నాయి. తెలుగు సినిమాగా రూపొంది తమిళ్.. హిందీల్లో కూడా రిలీజ్ అయిన ఘాజీ.. ఈ లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచింది. చిన్న సినిమా అయినా.. మంచి విజయం సాధించిన ఘాజీకి ఇది కూడా అవార్డ్ అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి అయితే.. ఏకంగా 3వ స్థానం సంపాదించుకోవడం మరీ విశేషం. ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బాహుబలి2.. ఐఎండీబీ లిస్ట్ లో టాప్2 స్థానాన్ని ఆక్రమించింది. ఇక టాప్ ప్లేస్ లో మాధవన్- విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద నిలవడం గమనించాల్సిన విషయం. విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మెర్సల్.. 9వ స్థానంలో నిలిచింది.

ఐఎండీబీ 2017 టాప్-10 సినిమాలు..

1. విక్రమ్ వేద

2. బాహుబలి: ది కంక్లూజన్

3. అర్జున్ రెడ్డి

4. సీక్రెట్ సూపర్ స్టార్

5. హిందీ మీడియం

6. ఘాజీ

7. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ

8. జాలీ ఎల్ ఎల్ బీ-2

9. మెర్శల్

10. ది గ్రేట్ ఫాదర్

,  ,  ,  ,  ,