Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 16:10:22
facebook Twitter Googleplus
Photo

తుఫాను వచ్చినప్పడు ఎంత పెద్ద చెట్టయినా తలవంచాల్సిందే. బాహుబలి- ది కంక్లూజన్ రిలీజయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న పాత రికార్డులన్నీ బాహుబలి కలెక్షన్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఇందులో టాలీవుడ్ - బాలీవుడ్ - ఓవర్సీస్ అన్న తేడాయేం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పాత రికార్డులు అన్నీ మాయమై కొత్త రికార్డులు క్రియేటవుతున్నాయి.

అమెరికా బాక్సాఫీస్ లో మంగళవారం నాడు బాహుబలి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రిలీజయినప్పటి నుంచి ఇప్పటిదాకా బాహబలి-2 అమెరికాలో మొత్తం 12 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కించుకుంది. యూఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రం బాహుబలి-2 కావడం విశేషం. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథతో అమీర్ ఖాన్ నటించిన దంగల్ పేరిట రికార్డు నమోదై ఉంది. బుధవారం కలెక్షన్ల లెక్క తేలాక ఈ రికార్డు సైతం బాహుబలి సొంతమైపోతుందని అంచనా. శనివారం సాయంత్రానికి 15 మిలియన్ డాలర్ల కలెక్షన్ వస్తుందని లెక్కలు వేస్తున్నారు.

ఓవర్సీస్ లో బాహుబలి-2 చిత్ర ప్రదర్శన హక్కులు రికార్డుస్థాయి ధరలకు విక్రయించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు ఊహించినా వారం రోజుల వ్యవధిలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధిస్తుందని ఊహించలేకపోయారు. మొత్తానికి బాహుబలి-2 రికార్డుల్లో కొత్త మైలురాయి సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 700 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేసింది

,  ,  ,  ,  ,