Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 12:07:30
facebook Twitter Googleplus
Photo

మన స్టార్ హీరోలు ఒకప్పుడు తమ సినిమాల ప్రమోషన్ గురించి అస్సలు పట్టించుకునే వాళ్లు కాదు. తమ స్థాయికి ప్రత్యేకంగా ప్రమోషనేమీ అక్కర్లేదు.. తమ సినిమాలకు కావాల్సినంత క్రేజ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది.. అన్న తరహాలో సైలెంటుగా ఉండేవాళ్లు. ఐతే మనోళ్లతో పోలిస్తే చాలా పెద్ద రేంజి హీరోలైన అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లే సినిమాలు రిలీజవుతుంటే మీడియా ముందుకొచ్చి రకరకాల ప్రమోషన్లలో పాల్గొంటుంటే మనోళ్లకేమైంది అన్న ప్రశ్న తలెత్తింది. ప్రమోషన్లలో పాల్గొంటే సినిమా రేంజి మరింత పెరుగుతుందని.. నెగెటివ్ టాక్ వచ్చినపుడు డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చని మన హీరోలకు కొంచెం ఆలస్యంగా అర్థమైంది. అందుకే పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ప్రమోషన్ మీద బాగానే దృష్టిపెడుతున్నారు ఈ మధ్య.

ఐతే ఈ జాబితాలోకి చాలా లేటుగా వచ్చి చేరాడు పవన్ కళ్యాణ్. తనకు తాను వేసుకున్న మొహమాటపు సంకెళ్లను విడిచిపెట్టి ?సర్దార్ గబ్బర్ సింగ్?ను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాడు. విడుదలకు ముందు హిందీలో ఇంటర్వ్యూలిచ్చిన పవన్.. రిలీజ్ తర్వాత తెలుగు మీడియాను పలకరించాడు. సుదీర్ఘ ఇంటర్వ్యూల్లో రకరకాల విషయాల గురించి మాట్లాడుతూనే.. ?సర్దార్? ముచ్చట్లు కూడా చెప్పాడు. ఐతే ఈ రకం ప్రమోషన్ సినిమాకు ఏమాత్రం మంచి చేసింది అన్నదే అర్థం కావడం లేదు. ఎందుకంటే పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల సినిమా కలెక్షన్ల్లేమీ పెరిగినట్లు కనిపించలేదు. సినిమా సెంట్రిగ్గా ఇంటర్వ్యూలు సాగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని.. పవన్ రాజకీయాలు.. తన సినీ భవిష్యత్తు.. వ్యక్తిగత విషయాల గురించి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మాట్లాడ్డం వల్ల ?సర్దార్ గబ్బర్ సింగ్?కు సంబంధించిన విశేషాలేమీ మీడియాలో హైలైట్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పైగా ?సర్దార్?కు సంబంధించి డైరెక్టర్ కానీ.. హీరోయిన్ కానీ.. ఇంకెవ్వరూ కానీ మీడియాలో కనిపించలేదు. ఈ రకం ప్రమోషన్ వల్ల సినిమాకు ఒరిగింది ఏమీ లేకపోయింది. ప్రమోషన్ చేయాలనుకున్నపుడు మహేష్ లాగా ప్రొఫెషనల్ గా రంగంలోకి దిగాల్సిందేమో పవన్. ఏదో మీడియా ప్రతినిధుల్ని ఒక్కొక్కరిగా పిలిపించుకుని ఇంటర్వ్యూలిస్తే అదే మహాభాగ్యం అన్నట్లు చేయడం వల్ల సినిమాకు అది పెద్దగా ఉపయోగపడలేదు.

,  ,  ,  ,  ,