Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 11:40:56
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించడంతో.. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గతంలో చిన్నపాటి టీజర్ ఇవ్వగా.. ఇప్పుడు 'బైటకొచ్చి చూస్తే టైమ్ ఏమో త్రీఓ క్లాక్' అంటూ సాగే పాటను పూర్తిగా విడుదల చేశారు. కోలీవడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. టాలీవుడ్ లో తొలిసారిగా సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. బైటకొచ్చి చూస్తే పాటను రిలీజ్ చేసిన 8 గంటల వ్యవధిలోనే మిలియన్ కు పైగా వ్యూస్ రావడం.. అనిరుధ్ ను కూడా షాక్ చేసేసింది. తన పాటకు జనాలు పట్టం కట్టడం.. టాలీవుడ్ లోకి ఇంతటి ఘన స్వాగతం పలకడంపై.. అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.

దీనికి ఎస్ ఎస్ థమన్ కూడా రిప్లై ఇవ్వడం విశేషం. ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కు ఓ ట్రయల్ మాత్రమేనని.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనన్నాడు థమన్.

,  ,  ,  ,  ,